ఢిల్లీ ఆస్పత్రిలో జూన్ 15 నుంచి స్పుత్నిక్-వీ పంపిణీ
ABN , First Publish Date - 2021-06-14T00:55:15+05:30 IST
జూన్ 15 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో రష్యా టీకా స్పుత్నిక్-వీ పంపిణీ ప్రారంభం కానుంది. దక్షిణ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి ఈ టీకా పంపిణీని చేపట్టనుంది.
న్యూఢిల్లీ: జూన్ 15 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో రష్యా టీకా స్పుత్నిక్-వీ పంపిణీ ప్రారంభం కానుంది. దక్షిణ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి ఈ టీకా పంపిణీని చేపట్టనుంది. ఆస్పత్రి సర్వీస్ చార్జ్, పన్నులు కలుపుకుని టీకా ధర రూ. 1145గా ఖరారైనట్టుగా తెలుస్తోంది. దైశంలో తొలిసారిగా స్పూత్నిక్-వీ టీకా పంపిణీ మే 15న హైదరాబాద్‌లో అపోలో ఆస్పత్రి, డా. రెడ్డీస్ ల్యాబ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే..పైలట్ ప్రాజెక్టులో భాగంగా అప్పట్లో ఈ టీకాను వేశారు. కాగా.. డీసీజీఐ అత్యవసర అనుమతి పొందిన ఈ టీకాను భారత్‌లో తయారు చేసేందుకు ఐదు ఫార్మా కంపెనీలు ఇప్పటివరకూ అనుమతులు పొందాయ. ప్రతి ఏటా 850 మిలయన్లు టీకా డోసులు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఎమ్‌ఆర్ఎన్‌ఏ టీకాలు మోడర్నా, ఫైజర్ తరువాత అత్యంత ప్రభావశీలత(91.6%) కలిగినది రష్యా టీకాయే అన్నది తెలిసిందే.