ముంబైలో పట్టాలు తప్పిన హైదరాబాద్ స్పెషల్ రైలు

ABN , First Publish Date - 2021-02-01T13:31:49+05:30 IST

ముంబై నుంచి హైదరాబాద్ రావాల్సిన స్పెషల్ రైలు ముంబై నగరంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌లో ఆదివారం రాత్రి పట్టాలు తప్పింది....

ముంబైలో పట్టాలు తప్పిన హైదరాబాద్ స్పెషల్ రైలు

ముంబై : ముంబై నుంచి హైదరాబాద్ రావాల్సిన స్పెషల్ రైలు ముంబై నగరంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌లో ఆదివారం రాత్రి పట్టాలు తప్పింది. ఆదివారం రాత్రి సీఎస్టీ రైల్వేస్టేషను నుంచి బయలుదేరిన హైదరాబాద్ స్పెషల్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైల్వేఅధికారులు సంఘటన స్థలానికి రిలీఫ్ ట్రైన్ ను రప్పించారు. రైలు పట్టాలు తప్పిన ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదని రైల్వేఅధికారులు చెప్పారు.ఈ ప్రమాద ఘటనతో మూడు రైళ్లను కుదించారు. నాందేడ్ -సీఎస్ఎంటీ స్పెషల్ రైలును బైకుల్లాలో, లక్నో-సీఎస్ఎంటీ రైలును దాదర్ లో, కర్మాలీ-సీఎస్ఎంటీ రైలును థానే వరకు కుదించారు. రైలు పట్టాలు తప్పిన ఘటనతో హైదరాబాద్ రావాల్సిన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

Updated Date - 2021-02-01T13:31:49+05:30 IST