ఎస్పీ నేత ఆజంఖాన్ పరిస్థితి విషమం
ABN , First Publish Date - 2021-05-29T20:33:14+05:30 IST
సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు లక్నోలోని మేదాంత ఆసుపత్రి వెల్లడించింది.
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు లక్నోలోని మేదాంత ఆసుపత్రి వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నట్టు పేర్కొంది. సీతాపూర్ జైలులో ఉన్న ఆజంఖాన్ కరోనా బారినపడడంతో ఈ నెల 9న లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లాఖాన్ కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
గతనెల 30న తండ్రీకొడుకులిద్దరూ కరోనా బారినపడ్డారు. అయితే, ఈ నెల 9న ఆజంఖాన్ పరిస్థితి ఒక్కసారిగా క్షీణించింది. దీంతో తండ్రీకొడులిద్దరినీ అంబులెన్స్‌లో లక్నోకు తరలించారు.
దాదాపు వందకుపైగా కేసులున్న ఆజంఖాన్ గతేడాది ఫిబ్రవరి నుంచి సీతాపూర్ జైలులో ఉన్నారు. అతని కుమారుడు అబ్దుల్లా కూడా పలు కేసుల్లో చిక్కుకుని అదే జైలులో ఉన్నాడు.