టీమిండియాపై సోనియా గాంధీ ప్రశంసల వర్షం

ABN , First Publish Date - 2021-01-20T18:16:49+05:30 IST

ఆసీస్‌పై టీమిండియా సాధించిన చరిత్రాత్మక గెలుపును అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటన విడుదల చేశారు. బ్రిస్బేన్‌లో మూడు దశాబ్దలుగా ఓటమెరుగని ఆసీస్‌ను మట్టికరిపించిన టీమిండియాను

టీమిండియాపై సోనియా గాంధీ ప్రశంసల వర్షం

న్యూఢిల్లీ: ఆసీస్‌పై టీమిండియా సాధించిన చరిత్రాత్మక గెలుపును అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటన విడుదల చేశారు. బ్రిస్బేన్‌లో మూడు దశాబ్దలుగా ఓటమెరుగని ఆసీస్‌ను మట్టికరిపించిన టీమిండియాను ఆమె ప్రశంసించారు. దృఢమైన సంకల్పంతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ... అద్వీతయమైన ఆటతీరును కనబరిచారని లేఖలో పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయుల్లాగే తానూ ఈ చరిత్రాత్మక గెలుపును ఆస్వాదించానని ఆమె అన్నారు. తమ ప్రతిభతో యువ ఆటగాళ్లు అంతర్జాతీయ గుర్తింపు సాధించారని  సోనియా అన్నారు. భౌతికంగా, మానసికంగా ఆటగాళ్లు దృఢంగా ఉన్నారని, అలాగే జట్టుగా ముందుకు వెళ్లడంతోనే ఈ విజయం సాధ్యమైందని లేఖలో తెలిపారు.  

Updated Date - 2021-01-20T18:16:49+05:30 IST