డ్రగ్స్ కేసులో మహారాష్ట్ర మంత్రి అల్లుడు అరెస్ట్!

ABN , First Publish Date - 2021-01-14T05:29:56+05:30 IST

డ్రగ్స్ కేసులో మహారాష్ట్ర మంత్రి అల్లుడు అరెస్ట్!

డ్రగ్స్ కేసులో మహారాష్ట్ర మంత్రి అల్లుడు అరెస్ట్!

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌‌ను ఎన్‌సీబీ అధికారులు ఓ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. సమీర్‌ను ఒకరోజంతా క్షుణ్ణంగా విచారించిన తర్వాతే ఆయనను అరెస్ట్ చేసినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు (ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాఖండే వెల్లడించారు. పశ్చిమ బంద్రాలో ఓ కొరియర్‌ నుంచి 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న వారం రోజుల్లోనే సమీర్‌ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అనంతరం జరిగిన ఆపరేషన్‌లో ఖార్‌లోని కరణ్ సజ్నానీ అనే వ్యక్తి ఇంటి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సజ్ననీతో పాటు మరో ఇద్దరు సోదరీలు రాహిలా ఫర్నిచర్‌వాలా, షైస్టా ఫర్నిచర్‌వాలా... మచ్చడ్ పానావాలాకి చెందిన రామ్ కుమార్ తివారీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విచారిస్తుండగా సమీర్ పేరు బయటకికి వచ్చింది. రాత్రి పొద్దుపోయేదాకా ప్రశ్నించిన పోలీసులు చివరికి ఆయనను కూడా అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-01-14T05:29:56+05:30 IST