బీబీనగర్ ఎయిమ్స్ సమస్యలను పరిష్కరించండి
ABN , First Publish Date - 2021-08-05T07:08:32+05:30 IST
బీబీనగర్ ఎయిమ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆరోగ్య
- కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బండి సంజయ్ వినతి
న్యూఢిల్లీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): బీబీనగర్ ఎయిమ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు. వచ్చే నెలలో జరిగే శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించాలని ప్రతిపాదించారు
. భవన నిర్మాణాలు పాక్షికంగా పూర్తయినప్పటికీ భవన అనుమతులు, ఫైర్ ఎన్‌వోసీ, కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల వంటి వాటిని అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. త్వరగా ఆస్పత్రి ప్రారంభించేందుకు మరిన్ని నిధులు అందించాలని పేర్కొన్నారు. బీబీనగర్ వద్ద రైళ్లను ఆపాలని రైల్వే శాఖకు ప్రతిపాదించడంతో పాటు ఆ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయాన్ని స్థాపించాలని విజ్ఞప్తి చేశారు.