స్వల్పంగా తగ్గిన డీజిల్‌ ధర

ABN , First Publish Date - 2021-08-20T07:41:22+05:30 IST

డీజిల్‌ ధర వరుసగా రెండో రోజూ దిగివచ్చింది. పెట్రోల్‌ ధర మాత్రం యథాతథంగానే ఉంది. డీజిల్‌ ధరను చమురు సంస్థలు బుధవారం మాదిరిగానే గురువారం లీటరుకు 20 పైసలు తగ్గించాయి.

స్వల్పంగా తగ్గిన డీజిల్‌ ధర

న్యూఢిల్లీ, ఆగస్టు 19: డీజిల్‌ ధర వరుసగా రెండో రోజూ దిగివచ్చింది. పెట్రోల్‌ ధర మాత్రం యథాతథంగానే ఉంది. డీజిల్‌ ధరను చమురు సంస్థలు బుధవారం మాదిరిగానే గురువారం లీటరుకు 20 పైసలు తగ్గించాయి. దీంతో ఢిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ.89.67 నుంచి రూ.89.47కు తగ్గింది. పెట్రో ల్‌ ధర మాత్రం రూ.101.84గా కొనసాగుతోంది. అం తర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో తగ్గుదల దే శీయంగా ఇంధన ధర తగ్గింపునకు దోహదపడినట్టు తెలుస్తోంది. చమురు సంస్థలు నెల రోజుల తర్వాత బుధవారం డీజిల్‌ ధరను తగ్గించాయి. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో సంస్థ లు ఇంధన ధరల జోలికి వెళ్లలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడిచమురు ధర 66.10 డాలర్లు ఉంది.

Updated Date - 2021-08-20T07:41:22+05:30 IST