భారత జాలర్లపై రాళ్లు రువ్విన SL navy

ABN , First Publish Date - 2021-10-07T23:28:34+05:30 IST

శ్రీలంక నేవీ మరోమారు చెలరేగిపోయింది. భారత జాలర్లపై రాళ్లు విసిరి వారి వలలను ధ్వంసం చేసింది. కచ్చతీవు

భారత జాలర్లపై రాళ్లు రువ్విన SL navy

రామేశ్వరం: శ్రీలంక నేవీ మరోమారు చెలరేగిపోయింది. భారత జాలర్లపై రాళ్లు విసిరి వారి వలలను ధ్వంసం చేసింది. కచ్చతీవు సమీపంలో ఈ ఘటన జరిగినట్టు తమిళనాడు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. పది ఫిషింగ్ బోట్లలో వచ్చిన శ్రీలంక నేవీ అధికారులు జాలర్లపై రాళ్లు రువ్వారని, దాదాపు 20 వలలను ధ్వంసం చేశారని ఆరోపించారు. అక్కడ వేటాడవద్దని హెచ్చరించాన్నారు.


అయితే, ఈ ఘటనలో జాలర్లు ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఈ ఘటనపై అధికారుల వద్ద ఫిర్యాదు నమోదైంది. భారత జాలర్లపై శ్రీలంక నేవీ దాడులు సర్వసాధారణమైపోయాయని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని జాలర్ల సంఘాల ప్రతినిధులు అధికారులను కోరారు. 

Updated Date - 2021-10-07T23:28:34+05:30 IST