శివకాశిలో బాణసంచా పేలి ఆరుగురి మృతి
ABN , First Publish Date - 2021-02-26T09:20:11+05:30 IST
శివకాశిలో బాణసంచా పేలి ఆరుగురి మృతి

చెన్నై, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాత్తూర్ సమీప అచ్చమంగళంలోని ఓ బాణ సంచా తయారీ కేంద్రంలో ఈ నెల 12 నాటి అగ్నిప్రమాదంలో 23 మంది మృతిచెందిన ఘటన మరువకముందే మరో ప్రమాదం సంభవించించిది. శివకాశి కాళైయార్‌కురిచ్చిలోని బాణసంచా కర్మాగారంలో గురువారం సాయంత్రం హఠాత్తుగా అగ్నిప్రమాదం సంభవించి ఐదుగురు సజీవదహనమయ్యారు.గాయపడిన మరో 16 మందిని శివకాశి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.