మూడు ముళ్లు.. ఆరు పెళ్లిళ్లు!

ABN , First Publish Date - 2021-11-28T08:27:19+05:30 IST

ఒకే పందిట్లో ఆరుగురు అక్కాచెల్లిళ్ల పెళ్లి రాజస్థాన్‌లోని చిరాని అనే గ్రామంలో శుక్రవారం జరిగింది. రోహితాశ్వ గుర్జార్‌కు ఏడుగురు కుమార్తెలు, ఓ కుమారుడు. తనకు ఉన్నంతలో అందరినీ బాగా చదివించాడు.

మూడు ముళ్లు.. ఆరు పెళ్లిళ్లు!

ఒకే వేదికపై ఆరుగురు అక్కాచెల్లెళ్లకు వివాహాలు


జైపూర్‌, నవంబరు 27: ఒకే పందిట్లో ఆరుగురు అక్కాచెల్లిళ్ల పెళ్లి రాజస్థాన్‌లోని చిరాని అనే గ్రామంలో శుక్రవారం జరిగింది. రోహితాశ్వ గుర్జార్‌కు ఏడుగురు కుమార్తెలు, ఓ కుమారుడు. తనకు ఉన్నంతలో అందరినీ బాగా చదివించాడు. ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకున్న ఆరుగురు కుమార్తెలూ బీఈడీ చదవగా.. చిన్న కుమార్తె ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ప్రతి ఇద్దరు అమ్మాయిలను ఒకే ఇంట్లో అన్నదమ్ములకు ఇచ్చి పెళ్లి చేశాడు. అలా.. ఆరుగురు అమ్మాయిలను మూడు కుటుంబాల్లో ఇచ్చాడు. కష్టనష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారనే అలా చేశానని అతడు చెబుతున్నాడు. ఈ పెళ్లిళ్లలో బంధుమిత్రులే కాక ఆ ఊరు మొత్తం ఆ జంటలతో కలిసి నృత్యం చేసింది.

Updated Date - 2021-11-28T08:27:19+05:30 IST