గతానికి భిన్నంగా... సూట్‌కేస్ బదులు ‘బాహీఖాతా’తో వచ్చిన నిర్మలా

ABN , First Publish Date - 2021-02-01T16:25:59+05:30 IST

బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర ముద్ర లభించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం ఉదయం కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది.

గతానికి భిన్నంగా... సూట్‌కేస్ బదులు ‘బాహీఖాతా’తో వచ్చిన నిర్మలా

న్యూఢిల్లీ : బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర లభించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం ఉదయం కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. కాసేపట్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. క్రీమ్ కలర్‌తో పాటు ఎర్రటి అంచు ఉన్న చీరతో కనిపించారు. చేతిలో రాజముద్రతో ఉన్న బ్యాగులో ట్యాబ్‌తో మీడియా ముందు కనిపించారు. ప్రతీసారి బడ్జెట్ తో ఉన్న ‘సూట్ కేస్’ తో దర్శనమిచ్చేవారు. ఈ సారి మాత్రం ‘బాహీ ఖాతా’ పేరుతో ఉన్న ఎరుపు రంగు బ్యాగుతో దర్శనమిచ్చారు. ఈ విషయంపై ప్రశ్నించగా... తమది సూట్‌కేసులు మోసే ప్రభుత్వం కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

Updated Date - 2021-02-01T16:25:59+05:30 IST