‘సింగార చెన్నై 2.0’కి ప్రత్యేక కమిటీ

ABN , First Publish Date - 2021-10-01T15:50:43+05:30 IST

రాజధాని నగరాన్ని విదేశాలకు ధీటుగా అందంగా తీర్చిదిద్దేందుకు రూ.500 కోట్లతో ‘సింగార చెన్నై 2.0’ పథకం రూపుదిద్దుకుంది. 426 చ.కి.మీ విస్తీర్ణానికి విస్తరించిన నగర రూపురేఖలు మార్చేందుకు

‘సింగార చెన్నై 2.0’కి ప్రత్యేక కమిటీ

ప్యారీస్‌(చెన్నై): రాజధాని నగరాన్ని విదేశాలకు ధీటుగా అందంగా తీర్చిదిద్దేందుకు రూ.500 కోట్లతో ‘సింగార చెన్నై 2.0’ పథకం రూపుదిద్దుకుంది. 426  చ.కి.మీ విస్తీర్ణానికి విస్తరించిన నగర రూపురేఖలు మార్చేందుకు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ కార్యదర్శి, రెవెన్యూ శాఖ కార్యదర్శి, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌, మెట్రోవాటర్‌ బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌లతో ఏర్పాటైన ఈ కమిటీ నగరంలోని 200 వార్డుల్లో పర్యటించి సింగార చెన్నై నిర్మాణానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేయనుంది. ఈ పథకం పనులు మొదలయ్యే వరకు కార్పొరేషన్‌ కమిషనర్‌ నేతృత్వంలో నెలకు ఒకసారి సమీక్షా సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-01T15:50:43+05:30 IST