అమరీందర్‌పై సిద్ధూ సంచలన ఆరోపణ

ABN , First Publish Date - 2021-10-22T02:44:19+05:30 IST

గురువారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సిద్ధూ స్పందిస్తూ ‘‘మూడు నల్ల సాగు చట్టాలకు రూపకర్త ఆయనే. ఆయనే పంజాబీల వ్యవసాయాన్ని అంబానీకి తాకట్టు పెట్టి పంజాబీ రైతులను నాశనం చేయాలనుకున్నారు. ఒకరిద్దరి కార్పొరేటర్ల కోసం చిన్న వ్యాపారులు, కూలీలల పొట్ట కొట్టారు’’ అని కెప్టెన్ పేరు ఎత్తకుండానే ట్వీట్ చేశారు.

అమరీందర్‌పై సిద్ధూ సంచలన ఆరోపణ

చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంచలన ఆరోపణ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు నల్ల సాగు చట్టాల రూపకర్త అమరీందరే అంటూ సిద్ధూ ఆరోపించారు. ఈ మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపుగా ఏడాది నుంచి రైతులు నిరవధిక నిరసన చేస్తున్నారు. కాగా, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరీందర్ పలుమార్లు మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ఆ చట్టాల రూపకర్త అమరీందరే అంటూ సిద్ధూ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గురువారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సిద్ధూ స్పందిస్తూ ‘‘మూడు నల్ల సాగు చట్టాలకు రూపకర్త ఆయనే. ఆయనే పంజాబీల వ్యవసాయాన్ని అంబానీకి తాకట్టు పెట్టి పంజాబీ రైతులను నాశనం చేయాలనుకున్నారు. ఒకరిద్దరి కార్పొరేటర్ల కోసం చిన్న వ్యాపారులు, కూలీలల పొట్ట కొట్టారు’’ అని కెప్టెన్ పేరు ఎత్తకుండానే ట్వీట్ చేశారు.

కెప్టెన్‌కు అమరీందర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటదనే విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం రోజురోజుకూ తారా స్థాయికి చేరుకుంటోంది. అమరీందర్‌పై సిద్ధూ ఘాటుగా స్పందిస్తుంటే.. అమరీందర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు.

Updated Date - 2021-10-22T02:44:19+05:30 IST