ఎస్‌ఐ దాష్టీకం!: యువకుడి నోట్లో బూటు పెట్టి దాడి

ABN , First Publish Date - 2021-05-30T10:07:25+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో నేరాల కేంద్రంగా పేరొందిన విజయపుర జిల్లా భీమాతీరలో అమానుషం చోటు చేసుకుంది.

ఎస్‌ఐ దాష్టీకం!: యువకుడి నోట్లో బూటు పెట్టి దాడి

బెంగళూరు, మే 29 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రంలో నేరాల కేంద్రంగా పేరొందిన విజయపుర జిల్లా భీమాతీరలో అమానుషం చోటు చేసుకుంది. జూదం ఆడుతున్నారనే సమాచారం ఇచ్చేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సంతోష్‌ నంద్యాల అనే యువకుడిపై సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ దారుణంగా ప్రవర్తించాడు. యువకుడి నోట్లో బూటు పెట్టి దాడి చేసినట్టు బాధిత యువకుడి తండ్రి గురులింగప్ప నంజాళ ఆరోపించాడు. ఇండి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాళప్పపూజారి ఈ దాష్టీకానికి పాల్పడ్డారు.  

Updated Date - 2021-05-30T10:07:25+05:30 IST