బర్డ్ ఫ్లూ వెనుక కూడా పాక్, ఖలిస్థాన్ హస్తముందా?: బీజేపీకి శివసేన ప్రశ్న

ABN , First Publish Date - 2021-01-12T16:49:56+05:30 IST

మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించడంపై బీజేపీపై శివసేన విమర్శనాస్త్రాలు గుప్పించింది.

బర్డ్ ఫ్లూ వెనుక కూడా పాక్, ఖలిస్థాన్ హస్తముందా?: బీజేపీకి శివసేన ప్రశ్న

ముంబై: మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించడంపై బీజేపీపై శివసేన విమర్శనాస్త్రాలు గుప్పించింది. శివసేన తన పత్రిక ‘సామ్నా’లో రాసిన వ్యాసంలో... కొంతమంది ప్రభుత్వ పెద్దలు, సర్కారు తరపున మాట్లాడుతున్నవారు... రైతుల ఆందోళన వెనుక పాకిస్తాన్, ఖలిస్థాన్ ఉన్నాయని, అలాగే మావోయిస్టుల హస్తం కూడా ఉందని  చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే దేశంలో ఇన్ని పక్షులు, కోళ్లు మృతి చెందడం వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు.


దేశంలో చికెన్ విక్రయాలు 40 శాతం మేరకు తగ్గుముఖం పట్టాయని, దీని ప్రభావం ఉన్నత వర్గాలపై ఉంటుందని అన్నారు. ఒకవైపు కరోనా వ్యాక్సిన్ అందరికీ చేరువవుతున్నంతలో, మరోవైపు బర్డ్ ఫ్లూ కొత్త సమస్యలను సృష్టిస్తున్నదన్నారు. పక్షుల మృతితో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటున్నదని పేర్కొన్నారు. కాగా వర్షాల కారణంగా ద్రాక్ష, బాదాం తదితర పంటలు దెబ్బతిన్నాయని, ఫలితంగా వాటి ఉత్పత్తి తగ్గిందని తెలిపారు.

Updated Date - 2021-01-12T16:49:56+05:30 IST