బ్రేకులు వేయలేక హారన్ పెద్దగా పెట్టారు: బడ్జెట్‌పై థరూర్

ABN , First Publish Date - 2021-02-01T23:07:14+05:30 IST

ఇక 2021-22 బడ్జెట్‌పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెదవి విరిచారు. మోనిటైజేషన్ ప్లాన్‌తో జాతి ఆస్తులను అమ్మకానికి పెట్టేస్తున్నారంటూ మండిపడ్డారు. బడ్జెట్‌పై రాహుల్ ఓ ట్వీట్‌లో తన స్పందన తెలియజేశారు

బ్రేకులు వేయలేక హారన్ పెద్దగా పెట్టారు: బడ్జెట్‌పై థరూర్

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2021-22పై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బ్రేకులు బిగించడం కుదరక హారన్ సౌండ్ పెద్దగా బింగించారు’ అంటూ సెటైర్లు గుప్పించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అనంతరం ఈ విషయమై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘‘బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూస్తే నాకు గ్యారేజ్ మెకానిక్ గుర్తొస్తున్నాడు. ఓసారి తన క్లైంట్‌తో ‘బ్రేకులు బిగించడం కుదరక హారన్ సౌండ్ పెద్దగా బింగించాను’ అని గ్యారేజ్ మెకానిక్ చెప్పాడు. బీజేపీ దేశ ప్రజలకు అలాగే చెప్తోంది’’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ చివరలో ‘బడ్జెట్ 2021’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.


ఇక 2021-22 బడ్జెట్‌పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెదవి విరిచారు. మోనిటైజేషన్ ప్లాన్‌తో జాతి ఆస్తులను అమ్మకానికి పెట్టేస్తున్నారంటూ మండిపడ్డారు. బడ్జెట్‌పై రాహుల్ ఓ ట్వీట్‌లో తన స్పందన తెలియజేశారు. 'జనం చేతుల్లో డబ్బులు ఉంచడానికి బదులు, మోదీ ప్రభుత్వం దేశానికి చెందిన ఆస్తులను తన క్రోనీ క్యాపిటలిస్ట్ మిత్రులకు ధారాదత్తం చేసేందుకు ప్లాన్ చేసింది' అని ఆయన తప్పుపట్టారు.

Updated Date - 2021-02-01T23:07:14+05:30 IST