ప్రతిపక్ష నేతలతో కీలక భేటీ నిర్వహించనున్న శరద్ పవార్

ABN , First Publish Date - 2021-06-21T21:31:33+05:30 IST

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయిన తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరో కీలక అడుగు వేశారు

ప్రతిపక్ష నేతలతో కీలక భేటీ నిర్వహించనున్న శరద్ పవార్

న్యూఢిల్లీ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయిన తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరో కీలక అడుగు వేశారు. మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టడానికి ముందకు వచ్చే విపక్ష నేతలతో పవార్ ఓ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పలు పార్టీలకు ఇప్పటికే పవార్ పక్షాన ఆహ్వానాలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌కు మాత్రం పవార్ బృందం ఈ ఆహ్వానాన్ని పంపలేదు. కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ నేత యశ్వంత్ సిన్హా  కూడా ప్రముఖ పాత్ర పోషించనున్నారు. ‘‘శరద్ పవార్, యశ్వంత్ సిన్హా ఇద్దరూ ఈ భేటీకి అధ్యక్షత వహిస్తారు. చర్చను ముందుకు తీసుకెళ్తారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చిస్తారు. అధ్యయనం చేస్తారు’’ అని ఈ సమావేశం బాధ్యులు ఆయా పార్టీల నేతలకు తెలిపినట్లు సమాచారం.  

Updated Date - 2021-06-21T21:31:33+05:30 IST