శభాష్‌ శ్యామల

ABN , First Publish Date - 2021-03-22T06:18:57+05:30 IST

భారత్‌-శ్రీలంక మధ్యనున్న పాక్‌ జలసంధిని(30 కిలోమీటర్ల మేర) ఈది రికార్డు సృష్టించిన

శభాష్‌ శ్యామల

పాక్‌ జలసంధిని ఈదిన మహిళకు దత్తాత్రేయ, కవిత ప్రశంసలు


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మార్చి21(ఆంధ్రజ్యోతి): భారత్‌-శ్రీలంక మధ్యనున్న పాక్‌ జలసంధిని(30 కిలోమీటర్ల మేర) ఈది రికార్డు సృష్టించిన తెలంగాణ మహిళ గోలి శ్యామలను హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఆదివారం శ్యామలతో దత్తాత్రేయ ఫోనులో మాట్లాడారు. ఈ ఘనత ఆమె సాహసానికి, పట్టుదలకు నిదర్శనమని, అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.


కాగా, ఎమ్మెల్సీ కవితను గోలి శ్యామల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్యామలను కవిత అభినందించారు. కవిత తన రోల్‌ మోడల్‌ అని గోలి శ్యామల అన్నారు. తన కలలను సాకారం చేసుకోవడానికి ఆర్థికంగా చేయూతనిచ్చిన కవితకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.

Updated Date - 2021-03-22T06:18:57+05:30 IST