దిలీప్ కుమార్ అస్తమయం
ABN , First Publish Date - 2021-07-08T08:31:00+05:30 IST
‘మేరా దిల్ ఆప్కా కోయీ హిందుస్థాన్ నహీ, జిస్‌పర్ ఆప్ హుకుమత్ కర్‌సకే’... (మీరు అధికారం చెలాయించడానికి నా మనసు మీరు ఏలుతున్న హిందుస్థాన్ కాదు) అని ‘మొఘల్-ఏ-ఆజమ్’లో తండ్రి అక్బర్‌తో సలీం పాత్రలో దిలీప్ కుమార్ చెప్పిన డైలాగ్ అ ప్పట్లో జనాలను ఉర్రూతలూగించింది.

- ప్రొస్టేట్ కేన్సర్‌తో కొన్నేళ్లుగా తీవ్ర అస్వస్థత..
- ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
ముంబై, జూలై 7: ‘మేరా దిల్ ఆప్కా కోయీ హిందుస్థాన్ నహీ, జిస్‌పర్ ఆప్ హుకుమత్ కర్‌సకే’... (మీరు అధికారం చెలాయించడానికి నా మనసు మీరు ఏలుతున్న హిందుస్థాన్ కాదు) అని ‘మొఘల్-ఏ-ఆజమ్’లో తండ్రి అక్బర్‌తో సలీం పాత్రలో దిలీప్ కుమార్ చెప్పిన డైలాగ్ అ ప్పట్లో జనాలను ఉర్రూతలూగించింది. తదనంతర రోజుల్లో ఈ డైలాగ్‌లోని పదాలు కాస్త అటూ ఇటూమారి దిలీప్ కుమార్ 54 ఏళ్ల సినీ జీవితానికి ప్రతిబింబమయ్యాయి. బాలీవుడ్ నట శిఖరంగా దిలీప్ కుమార్‌ను దేశం యావ త్తు గుండెల్లో పెట్టుకొని ఏలుకుంది. వెండితెరపై ఎన్నో పాత్రలకు తన అందం, సహజ నటనతో జీవం పోసి.. పాత్రోచిత హావభావాలు, మనసుకు హత్తుకునే సంభాషణ లతో సినీ ప్రియులను కట్టిపడేసిన ఈ ‘ట్రాజడీ కింగ్’ శాశ్వతంగా సెలవు తీసుకొని అభిమానులను శోకసంద్రంలో ముంచారు. 98 ఏళ్ల సంపూర్ణ జీవనం, ప్రపంచంలోనే గొప్ప నటుల్లో ఒకరిగా గుర్తింపుతో జీవన సాఫల్యం పొందిన బాలీవుడ్ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దిలీప్ కుమార్ ఇకలేరు. దీర్ఘకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 7:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సైరా బా ను ఉన్నారు. ఆమె ప్రముఖ సినీ నటి. వీరికి 1966లో పెళ్లయింది. వారికి పిల్లలు లేరు. దిలీప్‌కుమార్ కొన్నేళ్లుగా ప్రొ స్టేట్ కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు.
విషాదంలో బాలీవుడ్
ఉదయం 9:30 గంటలకు ఆస్పత్రి నుంచి దిలీప్ కుమార్ పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. తమ అభిమాన నటుడిని చివరిసారి చూసుకొని, నివాళులర్పించేందుకు అక్కడికి ప్రజలు పెద్త ఎత్తున తరలివచ్చారు. ధర్మేంద్ర, షబానా ఆజ్మీ, విద్యా బాలన్, సిద్ధార్థ రాయ్ కపూర్ తదితర సినీ ప్రముఖులు, పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. దిలీప్ కుమార్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సహా పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచారం వ్యక్తం చేశారు. ‘భారత సినిమా చరిత్రను రాస్తే గనక దిలీప్ కుమార్‌కు ముందు, తర్వాత అని ఉంటుంది’ అని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. ‘కొన్నేళ్లుగా అస్వస్థతతో బాదపడుతున్న యూసుఫ్ బాయ్(దిలీప్ కుమార్) ఎవ్వర్నీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో రాత్రింబవళ్లు ఆయనకు సైరా భాబీ(భార్య సైరా బాను) సపర్యలు చేశారు. యూసుఫ్ భాయ్ ఆత్మకు శాం తి కలగాలని ప్రార్థిస్తున్నాను’ అని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పేర్కొన్నారు.
షబానా ఆజ్మీ, సుభాష్ ఘాయ్, అజయ్ దేవగన్ తదితరులు ట్విటర్ వేదికగా నివాళులర్పించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ముంబైలోని జుహూ ఖబ్రస్థాన్‌లో అంత్యక్రియలు జరిగాయి. దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. ఆయన తర్వాతే బాలీవుడ్‌లోకి ఎంతమంది ఖాన్‌లు వచ్చారు. దీంతో దిలీ్‌ప ను ‘లెజండరీ ఖాన్, ది ఫస్ట్ ఖాన్’ అభిమానులు పిలుచుకునేవారు. అవిభాజ్య భారత్‌లోని పెషావర్‌లో(ప్రస్తు తం పాకిస్థాన్‌లో) 1922 డిసెంబరు 11న ఆయన జన్మించారు. 1944లో ‘జ్వార్ భాటా’ ఆయన నటించిన తొలిచి త్రం. 1998లో చివరి చిత్రమైన ‘ఖిలా’ దాకా మొత్తంగా 65 చిత్రాల్లో నటించారు. ‘మొఘల్-ఏ-ఆజమ్, దేవదాస్, నయా దౌర్, సంఘర్ష్, రామ్ ఔర్ శ్యామ్, దిల్ దియా దర్ద్ లియా, కాంత్రి, కర్మా తదితర చిత్రాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. 2000-2006 దాకా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. శివసేన వ్యవస్థాపడుకు బాల్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు పొందారు. హిందీ, పంజాబీ సహా ఉర్దూ, అవధ్, భోజ్‌పూరి, మరాఠి, బెంగాలీ, ఇంగ్లిషు భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. దిలీప్ మృతికి పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ విచారం వ్యక్తం చేశారు.