పిల్లల కోసం ప్రత్యేక కరోనా వ్యాక్సిన్..?

ABN , First Publish Date - 2021-02-09T00:37:22+05:30 IST

కొవ్యాక్సిన్ పేరిట కరోనా టీకా తయారు చేసిన భారత్ బయోటెక్ తాజాగా పిల్లలపై కూడా క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు నిశ్చయించుకుంది. ప్రస్తుతం ప్రభుత్వానుమతి కోసం ఎదురు చూస్తోంది. ఈ వాదంతంలో ఔషధ నియంత్రణ సంస్థ భారత్ బయోటెక్‌కు తగు అనుమతులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు విశ్వనీయ వర్గాలు చెబుతున్నాయి.

పిల్లల కోసం ప్రత్యేక కరోనా వ్యాక్సిన్..?

న్యూఢిల్లీ: కొవ్యాక్సిన్ పేరిట కరోనా టీకా తయారు చేసిన భారత్ బయోటెక్ తాజాగా పిల్లలపై కూడా క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు నిశ్చయించుకుంది. ప్రస్తుతం ప్రభుత్వానుమతి కోసం ఎదురు చూస్తోంది. ఈ వాదంతంలో ఔషధ నియంత్రణ సంస్థ భారత్ బయోటెక్‌కు తగు అనుమతులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు విశ్వనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం  కరోనా చర్చ మొత్తం పిల్లల టీకాలవైపు మళ్లింది. చిన్నారుల కోసం ప్రత్యేక టీకా అవసరమా లేక ప్రస్తుతమున్న టీకాలను వినియోగించవచ్చా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


పిల్లలకు ప్రత్యేక టీకా.. నిపుణులు ఏమంటున్నారంటే.. 

ఈఏడాది జనవరిలో భారత్‌లో టీకా కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి రెండో విడతల్లో వైద్య, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి తొలి డోసు అందింది. అయితే..పిల్లలకు టీకా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై ప్రభుత్వం ఇప్పటివరకూ స్పష్టమైన ప్రకటన ఏదీ చేయలేదు. అంతర్జాతీయ నిబందనల ప్రకారం..  పదహారేళ్లలోపు పిల్లలకు నిర్వీర్యమైన వైరస్‌ల నుంచి రూపొందిన వ్యాక్సిన్లనే ఇవ్వాలి. లైవ్(జీవించి ఉన్న) వైరస్‌ల ఆధారంగా రూపొందిన టీకాలు చిన్నారులకు నిషిద్ధం. భారత్ బయోటెక్‌కు రూపొందించిన కొవ్యాక్సిన్ నిర్వీర్యమైన వైరస్‌ ఆధారంగా తయారైంది. కానీ..ఆక్సఫర్డ్ టీకా పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం. చింపాజీల్లో ఫ్లూ వ్యాధికి కారణమయ్యే లైవ్ ఎడినోవైరస్‌కు కొన్ని మార్పులు చేయడం ద్వారా ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా శాస్త్రజ్ఞుల బృందం కొవీషీల్డ్‌ను రూపొందించింది. ఇక ఫైజర్, మోడర్నా టీకాలు జన్యుపదార్థాన్ని పోలీన ఎమ్‌ఆర్ఎన్ఏ ఆధారంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత్ బయోటెక్ చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వానుమతి లభిస్తే ఫిబ్రవరి నెలఖారులో ఈ ట్రయల్స్ ప్రారంభిస్తామని, 2-18 మధ్య వయసున్న పిల్లలకు కొవ్యాక్సిన్ ఏమేరకు రక్షణ కల్పిస్తుందో పరిశీలిస్తామని సంస్థ పేర్కొంది.

Updated Date - 2021-02-09T00:37:22+05:30 IST