సీనియర్‌ పాత్రికేయుడు నాగరాజ్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-08-27T16:21:21+05:30 IST

సీనియర్‌ పాత్రికేయుడు గుడిహళ్ళి నాగరాజ్‌ (66) బెంగళూరులో గురు వారం సాయంత్రం కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడు తున్నట్లు తెలి

సీనియర్‌ పాత్రికేయుడు నాగరాజ్‌ కన్నుమూత

బెంగళూరు: సీనియర్‌ పాత్రికేయుడు గుడిహళ్ళి నాగరాజ్‌ (66) బెంగళూరులో గురువారం సాయంత్రం కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. కర్ణాటక వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం అధ్యక్షునిగానూ, బెంగళూరు ప్రెస్‌క్లబ్‌ ఉపాధ్యక్షునిగానూ గతం లో ఆయన సేవలందించారు. ప్రజావాణి కన్నడ దినపత్రికలో సుదీర్ఘకాలం ఆయన పాత్రికేయుడిగా సేవలందించారు. పాత్రికే య సంఘాల్లోనూ చురుకైన పాత్రను పోషించారు. నాటకరంగంలోనూ ఆయన సేవలందించారు. యువ జర్నలిస్టులకు ఆయన మార్గదర్శకుడిగా వ్యవహరించేవారు. నాగరాజ్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు నళినికుమార్‌ కటిలు, కన్నడ సాంస్కృతిక శాఖా మంత్రి వీ సునీల్‌ కుమార్‌ ప్రగాఢసంతా పాన్ని ప్రకటించారు. కర్ణాటక మీడియా ఆకాడమీ అధ్యక్షులు సదాశివ శెణై, కర్ణాటక వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు శివానంద తగడూరు ప్రెస్‌క్లబ్‌ ప్రధాన కార్యదర్శి కిరణ్‌ తదితరులు నాగరాజ్‌ మృతికి సంతాపం ప్రకటించిన వారిలో ఉన్నారు. కాగా నాగరాజ్‌ అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం హరపనహళ్ళి తాలుకాని గుడిహళ్ళిలో జరుగనున్నాయి.

Updated Date - 2021-08-27T16:21:21+05:30 IST