సీనియర్‌ జర్నలిస్టు చందన్‌ మిత్రా కన్నుమూత

ABN , First Publish Date - 2021-09-03T07:42:35+05:30 IST

సీనియర్‌ పాత్రికేయు డు, రాజ్యసభ మాజీ సభ్యుడు చందన్‌ మిత్రా (65) ఇకలేరు. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి ఢిల్లీలోని...

సీనియర్‌ జర్నలిస్టు చందన్‌ మిత్రా కన్నుమూత

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: సీనియర్‌ పాత్రికేయు డు, రాజ్యసభ మాజీ సభ్యుడు చందన్‌ మిత్రా (65) ఇకలేరు. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయనకు భార్య షొబొరి గంగూలీ, కుమారులు కుషాన్‌, శాక్య ఉన్నారు. సుదీర్ఘ జర్నలిస్టు కెరీర్‌లో ఆయన ది పయనీర్‌, హిందూస్థాన్‌ టైమ్స్‌, స్టేట్స్‌మన్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తదితర పత్రికల సంపాదకుడిగా పనిచేశారు. 2018లో బీజేపీకి రాజీనామా చేసి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రె్‌సలో చేరారు. తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  

Updated Date - 2021-09-03T07:42:35+05:30 IST