పార్టీలు వేరైనా.. సంబంధాలను తెంచుకోం : శివసేన ఎంపీ సావంత్

ABN , First Publish Date - 2021-06-22T01:25:27+05:30 IST

తాము ఎవ్వరినీ శత్రువులుగా చూడమని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రకటించారు. తనకు బీజేపీలో కూడా మిత్రులున్నార

పార్టీలు వేరైనా.. సంబంధాలను తెంచుకోం : శివసేన ఎంపీ సావంత్

ముంబై : తాము ఎవ్వరినీ శత్రువులుగా చూడమని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రకటించారు. తనకు బీజేపీలో కూడా మిత్రులున్నారని అన్నారు. రాజకీయ వైరుద్ధ్యం, సైద్ధాంతిక పునాదులు వేరైనా, తమ సంబంధాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని ప్రకటించారు. తాము ప్రతిపక్ష నేతలను శత్రువులుగా మాత్రం చూడమని తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇబ్బందిపెడుతున్నాయన్న శివసేన ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ‘‘ఐటీ, ఈడీ సంస్థలు కొన్ని సార్లు వేధిస్తున్నాయి. సీబీఐ కూడా కొన్నిసార్లు ఇలాగే వ్యవహరిస్తుంటుంది. బీజేపీతో కలవడం ఒక్కటే మార్గం. ఇలా చేయడమంటే అధికార పార్టీ బ్లాక్‌మెయిలింగ్ చేయడమే. బెంగాల్‌లో అదే జరుగుతోంది. నారద స్కాం అవినీతికిలో పాలు పంచుకున్న ఇద్దరు బీజేపీలో చేరిపోయారు. వారిని కేంద్రం ఏమీ అనడం లేదు’’ అని సావంత్ దెప్పిపొడిచారు. 


Updated Date - 2021-06-22T01:25:27+05:30 IST