Semiconductor shortage: 76,000 కోట్ల PLI పథకానికి మంత్రివర్గం ఆమోదం
ABN , First Publish Date - 2021-12-16T03:50:31+05:30 IST
Semiconductor shortage: 76,000 కోట్ల PLI పథకానికి మంత్రివర్గం ఆమోదం

న్యూఢిల్లీ: సెమీకండక్టర్ డివైసెస్ ఉత్పత్తి కొరత ఏర్పడడంతో తయారీదారులను ఆకర్షించేందుకు రూ. 76,000 కోట్ల ప్రోత్సాహక ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో సెమీకండక్టర్ల తయారీని పెంచేందుకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రోత్సాహక ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, అశ్వనీ వైష్ణవ్ భారతదేశంలో సెమీకండక్టర్ మరియు డిస్ప్లే బోర్డ్ ఉత్పత్తికి రూ. 76,000 కోట్ల విలువైన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని ప్రకటించారు.