సెల్ఫీ మోజు ఎంతపని చేసిందో తెలిస్తే...
ABN , First Publish Date - 2021-07-08T17:43:30+05:30 IST
మధ్యాహ్న భోజన ఏజెన్సీ వంటమనిషితో సెల్ఫీతీసుకుని సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన ఉపాధ్యాయుడు ఆంజనేయ నాయ్క సస్పెన్షన్ వేటుకు గురైన సంఘటన దావణగెరె జిల్లాలో చోటు చే

- భోజన ఏజెన్సీ వంటమనిషితో సెల్ఫీ
- హెచ్‌ఎంపై సస్పెన్షన్ వేటు
బెంగళూరు: మధ్యాహ్న భోజన ఏజెన్సీ వంటమనిషితో సెల్ఫీతీసుకుని సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన ఉపాధ్యాయుడు ఆంజనేయ నాయ్క సస్పెన్షన్ వేటుకు గురైన సంఘటన దావణగెరె జిల్లాలో చోటు చేసుకుంది. జగళూరు తాలూకా గోగుద్ది గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి తీరుపై గ్రామస్తులలో ఆగ్రహం నెలకొంది. మద్యం సేవించి పాఠశాలకు రావడం, విద్యార్థులచే గుట్కాలు తెప్పించుకోవడం వంటివి చేసేవారు. పలుమార్లు స్థానికులు మందలించినా అతడిలో మార్పురాలేదు. పాఠశాలలు కొనసాగక పోయినా రోజూ హాజరై భోజన ఏజెన్సీ వంటమనిషిని రప్పించుకుని సెల్ఫీలు తీసుకో వడంతో పాటు ఆమెతో సన్నిహితంగా గడిపేవారు. జిల్లా విద్యాశాఖాధికారులకు సమాచారం చేరవేసినా ప్ర యోజనం లేకుండా పోయింది. విసుగుచెందిన గ్రామస్తులు సదరు సోషల్ మీడియా పోస్టింగ్‌లను విద్యాశా ఖామంత్రి సురేష్‌కుమార్‌కు పంపారు. వెంటనే మంత్రి స్పందిస్తూ డీడీపీఐను విచారణకు ఆదేశించారు. సదరు పోస్టింగ్‌లతో పాటు గ్రామస్తుల ఆరోపణలు వాస్తవమని తేలడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువమంది ఇతడికి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. డీడీపీఐ నివేదిక మేరకు ఉపాధ్యాయుడు ఆంజనే య నాయ్కపై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా రెండేళ్ళ కిందట ఓ మహిళ వేధింపులకు గురిచేస్తున్నారని ఇదే ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.