Bsf Search operation: పాక్ సరిహద్దుల్లో రెడ్లైట్ పరికరం
ABN , First Publish Date - 2021-07-24T12:37:00+05:30 IST
జమ్మూకశ్మీరులోని పాకిస్థాన్ దేశ సరిహద్దు అయిన కథువా వద్ద శుక్రవారం రాత్రి స్థానికులకు గుర్తుతెలియని రెడ్ లైట్ పరికరాన్ని కనుగొన్నారు...

కథువా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని పాకిస్థాన్ దేశ సరిహద్దు అయిన కథువా వద్ద శుక్రవారం రాత్రి స్థానికులకు గుర్తుతెలియని రెడ్ లైట్ పరికరాన్ని కనుగొన్నారు.కథువా సరిహద్దుల్లోని ఆర్నియా సెక్టారులో రాత్రివేళ ఎర్రటి కాంతితో మెరుస్తూ పరికరం కనిపించడంతో స్థానిక ప్రజలు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కు సమాచారం అందించారు.దీంతో రంగంలోకి దిగిన బీఎస్ఎఫ్ జవాన్లు ఎర్రటి లైటు వెలుగుతున్న పరికరం వైపు కాల్పులు జరిపారు.పాక్ సరిహద్దుల్లో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు ఎర్రలైటు పరికరం కోసం గాలిస్తున్నారు.సరిహద్దుల్లో ఇటీవల డ్రోన్లు ప్రత్యక్షమైన నేపథ్యంలో బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమై అనుమానాస్పద పరికరం కోసం శోధిస్తున్నారు. సరిహద్దుల్లో అలర్ట్ ప్రకటించారు.