సింగపూర్‌లో స్కూళ్లు బంద్‌!

ABN , First Publish Date - 2021-05-18T07:51:09+05:30 IST

కరోనా కొత్త స్ట్రెయిన్లతో పిల్లలకు ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యం లో.. సింగపూర్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది

సింగపూర్‌లో స్కూళ్లు బంద్‌!

కొత్త స్ట్రెయిన్ల ప్రభావం పిల్లలపై ఉంటుందన్న హెచ్చరికతో నిర్ణయం


సింగపూర్‌, మే 17: కరోనా కొత్త స్ట్రెయిన్లతో పిల్లలకు ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యం లో.. సింగపూర్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. బుధవారం నుంచి అక్కడ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలను మూసివేయాలని నిర్ణయించింది. ఈ నెలాఖరుతో ముగియనున్న విద్యా సంవత్సరాన్ని ఆన్‌లైన్‌ తరగతులతో పూర్తి చేయాలని ఆదేశించింది. ఇటీవల భారత్‌లో వెలుగులోకి వచ్చిన కొన్ని కొత్త స్ట్రెయిన్లు పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూ పుతున్నాయని, ఈ వేరియంట్లు ప్రస్తుతం సింగపూర్‌లో కూడా ప్రవేశించాయని నిపుణులు హెచ్చరించారు. కరో నా ఫ్రీగా మారిన కొన్ని నెలల తర్వాత.. సింగపూర్‌లో మ ళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం 38 కరోనా కేసు లు వెలుగులోకి వచ్చాయి. గడచిన 8 నెలల కాలంలో ఇవే అత్యధికం కావడం గమనార్హం. దీంతో.. అక్కడి ప్రభుత్వం.. ప్రజా జీవనంపై మళ్లీ ఆంక్షలు విధిస్తోంది. 

Updated Date - 2021-05-18T07:51:09+05:30 IST