కొవిడ్ బారిన పడిన కుటుంబాన్ని భారత్ నుంచి వెనక్కి రప్పించిన సౌదీ

ABN , First Publish Date - 2021-05-19T04:50:57+05:30 IST

కొవిడ్-19 బారిన పడిన ఓ సౌదీ కుటుంబాన్ని భారత్ నుంచి ప్రత్యేక వైద్య విమానంలో వెనక్కి రప్పించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది...

కొవిడ్ బారిన పడిన కుటుంబాన్ని భారత్ నుంచి వెనక్కి రప్పించిన సౌదీ

రియాద్: కొవిడ్-19 బారిన పడిన ఓ సౌదీ కుటుంబాన్ని భారత్ నుంచి ప్రత్యేక వైద్య విమానంలో వెనక్కి రప్పించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ విమానం 15 గంటల పాటు పయనించి రియాద్‌లోని కింగ్ సాల్మాన్ ఎయిర్ ఫోర్స్ స్థావరానికి చేరుకున్నట్టు సౌదీ గెజిట్ వెల్లడించింది. సౌదీ రాజు సాల్మన్ ఆదేశాల మేరకు రక్షణ శాఖ సదరు సౌదీ కుటుంబాన్ని ఎయిర్‌లిఫ్ట్ చేసినట్టు తెలిపింది. అయితే దీనిపై న్యూఢిల్లీలోని సౌదీ ఎంబసీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా సౌదీ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్‌లు రన్‌వే సమీపంలో ఎదురుచూస్తున్నట్టు కొన్ని ఫోటోలు స్థానిక మీడియాలో ప్రచురితం అయ్యాయి. కాగా కరోనా కారణంగా  ఆరోగ్య పరిస్థితి విషమించిన దాదాపు 74 మందిని సౌదీ అరేబియా ప్రత్యేక విమానాల్లో తరలించింది. సౌదీలో ఇప్పటి వరకు 435,027 మంది కరోనా బారిన పడ్డారు. గడచిన 24 గంటల్లో ఇక్కడ మరో 1,047 కొత్త కేసులు నమోదయ్యాయి. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సౌదీలో కరోనా మరణాల సంఖ్య 7,188కి పెరిగింది. 

Updated Date - 2021-05-19T04:50:57+05:30 IST