దెబ్బతిన్న ఊపిరితిత్తులు క్షీణించిన శశికళ ఆరోగ్యం
ABN , First Publish Date - 2021-01-23T06:41:46+05:30 IST
దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ఆరోగ్యం క్షీణించిందని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు శుక్రవారం వెల్లడించారు.
బెంగళూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ఆరోగ్యం క్షీణించిందని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు శుక్రవారం వెల్లడించారు. ఆమె ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్టు వైద్యవర్గాల ద్వారా తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్న విషయం తెలిసిందే. గురువారం రాత్రి ఆమెకు కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కాగా శివాజీనగర్‌లోని బౌరింగ్ ఆస్పత్రి నుంచి విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఈనెల 27న శశికళ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఈలోపే ఆమె ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది.