మోదీ సర్కార్‌పై ఎలాంటి అవినీతి మరకలు లేవు : సంజయ్ రౌత్ కితాబు

ABN , First Publish Date - 2021-05-31T00:46:23+05:30 IST

ప్రధాని మోదీ ఏడేళ్ల పాలన సందర్భంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మోదీ సర్కార్‌పై

మోదీ సర్కార్‌పై ఎలాంటి అవినీతి మరకలు లేవు : సంజయ్ రౌత్ కితాబు

ముంబై : ప్రధాని మోదీ ఏడేళ్ల పాలన సందర్భంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మోదీ సర్కార్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేవని కితాబునిచ్చారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం నుంచి రోటి, కపడా, మకాన్ మాత్రమే ప్రజలు ఆశిస్తున్నారని, టాటా, బిర్లా, అదానీ కావాలన్న కాంక్ష ప్రజలకు లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశానికి కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. మాజీ ప్రధాని నెహ్రూ పాలనతో పోలిస్తే ప్రస్తుత మోదీ సర్కార్ కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. మౌలిక సదుపాయాలు, వివిధ సంస్థల అభివృద్ధి అంతా నెహ్రూ హయాంలో జరిగిందని, ప్రస్తుతం అవే కొనసాగుతున్నాయని రౌత్ ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-05-31T00:46:23+05:30 IST