ఇండియాకు గుడ్ న్యూస్.. చైనాకు బ్యాడ్ న్యూస్

ABN , First Publish Date - 2021-06-22T02:31:07+05:30 IST

ఇండియాకు గుడ్ న్యూస్.. చైనాకు బ్యాడ్ న్యూస్

ఇండియాకు గుడ్ న్యూస్.. చైనాకు బ్యాడ్ న్యూస్

న్యూఢిల్లీ: కొరియాకు చెందిన శాంసంగ్ సంస్థ.. చైనాకు షాక్ ఇచ్చింది. అదే సమయంలో ఇండియాకు తీపి కబురు చెప్పింది. చైనాలో నిర్మించాలని అనుకున్న ‘డిస్‌ ప్లే తయారీ యూనిట్’ను ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో తరలిస్తున్నట్లు శాంసంగ్ కంపెనీ ప్రకటించింది. ఈ విషయమై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి వివరాలు తెలియజేశారు శాంసంగ్ సంస్థ నైరుతి అధ్యక్షుడు కెన్ కాంగ్. ఇండియాలో పరిస్థితులు బాగున్నాయని.. ఇక్కడి పారిశ్రామిక వాతావరణం, పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాల కారణంగానే డిస్‌ ప్లే తయారీ యూనిట్ నిర్మాణాన్ని చైనా నుంచి ఇండియాకు మార్చినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం భారత ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఊతం ఇస్తుందని పేర్కొంది. ఈ నిర్మాణంతో ఇండియా పట్ల తమ నిబద్ధతను తెలయజేస్తుందని శాంసంగ్ ప్రతినిధి బృందం పేర్కొంది.

Updated Date - 2021-06-22T02:31:07+05:30 IST