సెమ్మొళి పార్కులో కూరగాయలు, పండ్ల విక్రయాలు
ABN , First Publish Date - 2021-04-09T14:36:29+05:30 IST
స్థానిక తేనాంపేటలో ఉన్న సెమ్మొళి పార్కులో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఉద్యా
పెరంబూర్(చెన్నై): స్థానిక తేనాంపేటలో ఉన్న సెమ్మొళి పార్కులో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో పచ్చదనంతో కూడుకున్న ఈ పార్కును ప్రతిరోజూ వందలాది మంది సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో, పార్కులో కూరగాయలు, పండ్లు విక్రయ దుకాణాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యానవన శాఖ నిర్ణయించగా, ప్రభుత్వం రూ.34 కోట్లు కేటాయించింది. రైతుల వద్దకే వెళ్లి కూరగాయలు కొనుగులు చేసి పార్కులో విక్రయించేలా తొలుత అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఆ పార్కులో కూరగాయలు, పండ్లు, ఆకుకూరల విక్రయ దుకాణం ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.