‘టీకా పంపిణీని చెడగొట్టేందుకు రష్యా,చైనా ప్రయత్నాలు’

ABN , First Publish Date - 2021-01-13T16:16:16+05:30 IST

అమెరికాలో పెద్ద ఎత్తున కరోనా టీకా కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ విలియమ్ ఎవనైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీకా పంపిణీని చెడగొట్టేందుకు రష్యా, చైనాలు ప్రయత్నించవచ్చంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీకా పంపిణీని అడ్డుకునేందుకు మన ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు.

‘టీకా పంపిణీని చెడగొట్టేందుకు రష్యా,చైనా ప్రయత్నాలు’

వాషింగ్టన్: అమెరికాలో పెద్ద ఎత్తున కరోనా టీకా కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ విలియమ్ ఎవనైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీకా పంపిణీని చెడగొట్టేందుకు రష్యా, చైనాలు ప్రయత్నించవచ్చంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీకా పంపిణీని అడ్డుకునేందుకు మన ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. అని మంగళవారం నాడు జరిగిన పత్రికా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. వారు ఎవరు అని విలేకరులు ప్రశ్నించగా..రష్యా, చైనాయే అని ఆయన టక్కున సమాధానమిచ్చారు. అమెరికాలోని టీకా సంబంధిత సమాచారాన్ని తస్కరించేందుకు రష్యా చైనాలు హ్యాకింగ్‌కు దిగుతున్నాయంటూ గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 


రష్యా, చైనాలు మాత్రం ఈ ఆరోపణలపై ఇంకా స్పందించలేదు. మరోవైపు..అమెరికాలో టీకా పంపిణీ కార్యక్రమం మందకొడిగా సాగుతున్నట్టు తెలుస్తోంది. అక్కడి ఫెడరల్ ప్రభుత్వం పంపించిన టీకాలను ఏ రాష్ట్రం కూడా పూర్తిస్థాయిలో వినియోగించలేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా అంటువ్యాధుల సంస్థ ప్రకారం..ఇప్పటివరకూ 90 లక్షల మంది అమెరికన్లు కరోనా టీకా తొలి డోసును తీసుకున్నారు. 

Updated Date - 2021-01-13T16:16:16+05:30 IST