బూస్టర్‌ డోసుకు పరుగులొద్దు!

ABN , First Publish Date - 2021-08-20T07:39:04+05:30 IST

కరోనా డెల్టా వేరియంట్‌పై టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని ప్రముఖ శాస్త్రవేత్త, అంటువ్యాధుల నిపుణురాలు గగన్‌దీప్‌ కాంగ్‌ అన్నారు.

బూస్టర్‌ డోసుకు పరుగులొద్దు!

ప్రముఖ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 19: కరోనా డెల్టా వేరియంట్‌పై టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని ప్రముఖ శాస్త్రవేత్త, అంటువ్యాధుల నిపుణురాలు గగన్‌దీప్‌ కాంగ్‌ అన్నారు. మూడో డోస్‌ వేసుకుంటే పూర్తిగా వైరస్‌ నుంచి రక్షణ పొందవచ్చన్న భరోసా ఏమీ లేదని, కొంత రక్షణ మాత్రం ఉంటుందని చెప్పారు. బూస్టర్‌ డోసుల కోసం అనవసరమైన హడావుడి వద్దన్నారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా, యూకేల్లో బూస్టర్‌ డోస్‌కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో గగన్‌దీప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్‌) టీకాల సమర్థతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌వర్సిటీ చేసిన రెండు వేర్వేరు అధ్యయనాల్లో భిన్నఫలితాలు వెలువడ్డాయి. ఫైజర్‌, కొవిషీల్డ్‌ రెండు డోసులూ వేసుకుంటే డెల్టా వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. మరో అధ్యయనంలో వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకున్న వారిలోనూ, వేసుకోని వారిలోనూ డెల్టా వేరియంట్‌ వైరస్‌ స్థాయిలు ఒకే విధంగా ఉన్నట్లు తేల్చారు. 

Updated Date - 2021-08-20T07:39:04+05:30 IST