రౌడీల నివాసాలపై సీసీబీ దాడులు
ABN , First Publish Date - 2021-07-24T18:06:58+05:30 IST
నగరంలో రౌడీల నివాసాలపై సీసీబీ పోలీసులు శుక్రవారం మెరుపుదాడులను నిర్వహించారు. సంఘవిద్రోహ కార్యక పాల్లో పాల్గొంటే సహించేది లేదని హెచ్చరించారు. సీసీబీ జాయింట్ కమిషనర్ సం

బెంగళూరు: నగరంలో రౌడీల నివాసాలపై సీసీబీ పోలీసులు శుక్రవారం మెరుపుదాడులను నిర్వహించారు. సంఘవిద్రోహ కార్యక పాల్లో పాల్గొంటే సహించేది లేదని హెచ్చరించారు. సీసీబీ జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ నాయత్వంలో తెల్లవారుజాము 4 గంటలకే ప్రారంభమైన దాడులు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. నగరంలోని మొత్తం 8 విభాగాల్లోనూ దాడులు జరిపి రౌడీలను హెచ్చరించినట్లు సీసీబీ పోలీసులు వెల్లడించారు. పేరు మోసిన రౌడీలు సైకిల్ రవి, సైలెంట్ సునీల, మారేన హళ్ళి జగ్గల, జేసీబీ నారాయణ్‌తో పాటు పలు మాజీ రౌడీల నివాసాలలో తనిఖీలు నిర్వహించారు. బెంగళూరు సెంట్రల్ విభాగంలోని విల్సన్ గార్డెన్, శాంతినగర, సంపంగిరామనగర, శివాజినగర్ ప్రాంతాల్లో జరిగిన దాడుల సందర్భంగా మారణాయుధాలు, గాంజా, పెద్ద పెట్టున ఆధార్ కార్డులు లభించినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న కూడా సీసీబీ పోలీసులు నగరంలో పలు చోట్ల మాజీ రౌడీల నివాసాలపై దాడులు జరిగిన సంగతి విదితమే. శివాజీనగర్‌లోని మాజీ రౌడీ షహనాజ్ నివాసంలో 254 ఆధార్‌కార్డులు లభించడం కుతూహలం రేకెత్తిస్తోంది. ఈ ఆధార్ కార్డులను ఎందుకు సేకరించి పెట్టుకున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీసీబీ వర్గాలు వెల్లడించాయి.