నడిరోడ్డుపైనే కత్తితో దాడి

ABN , First Publish Date - 2021-08-27T16:34:00+05:30 IST

ఒకే కళాశాలలో చదివే విద్యార్థులు గడిచిన మూడేళ్ళుగా అన్యోయంగా ఉండేవారు. ఒక్కసారిగా యువకుడు ప్రేమ ప్రస్తావన తీసుకురాగా నిరాకరించినందుకు ఏకంగా కత్తితో దాడి చేసిన సంఘటన బెం

నడిరోడ్డుపైనే కత్తితో దాడి

బెంగళూరు: ఒకే కళాశాలలో చదివే విద్యార్థులు గడిచిన మూడేళ్ళుగా అన్యోయంగా ఉండేవారు. ఒక్కసారిగా యువకుడు ప్రేమ ప్రస్తావన తీసుకురాగా నిరాకరించినందుకు ఏకంగా కత్తితో దాడి చేసిన సంఘటన బెంగళూరు నగరం బాగలగుంటెలో జరిగింది. బుధవారం చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు మేరకు ఒకే ప్రాంతానికి చెందిన ఉదయ్‌తో పాటు విద్యార్థిని రాజాజీనగర్‌లోని ఓ కళాశాలలో పీయూ కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం డిగ్రీలో చేరారు. ఇరువురు మూడేళ్ళుగా స్నేహంగా ఉండేవారు. ఇటీవలే ప్రేమ విషయాన్ని విద్యార్థిని దృష్టికి తీసుకు రావడంతో ససేమిరా అన్నట్లు బాగలగుంటె పోలీసులు తెలిపారు. విద్యార్థినిపై క్యక్ష పెంచుకున్న ఉదయ్‌ ఆన్‌లైన్‌లో బటన్‌ చాకును తెప్పించుకుని దాడికి పాల్పడ్డారు. రోడ్డుపై వెళుతున్న విద్యార్థినిపై ఒక్కసారిగా చాకుతో గొంతుభాగంతో పాటు తొడవద్ద బలంగా పొడిచారు. ఒక్కసారిగా విద్యార్థిని కుప్పకూలిపోవడంతో సమీపంలోని గోడకు తలను కొట్టుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన స్థానికులు వెంటనే ఇరువురినీ ఆసుపత్రికి తరలించారు. బాగలగుంటె పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  


Updated Date - 2021-08-27T16:34:00+05:30 IST