Road accidentలో పోలీసు మృతి..మరో ముగ్గురికి గాయాలు
ABN , First Publish Date - 2021-10-25T17:39:58+05:30 IST
వాణియం బాడీ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమా దంలో పోలీసు మృతిచెందగా మరో ముగ్గురికి గాయాల య్యాయి. కేతాండమ్ పట్టి సమీపంలోని

చెన్నై/వేలూరు: వాణియం బాడీ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమా దంలో పోలీసు మృతిచెందగా మరో ముగ్గురికి గాయాల య్యాయి. కేతాండమ్ పట్టి సమీపంలోని చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో చెన్నైలో పనిచేస్తున్న పోలీసు సురేష్‌కుమార్ తీవ్రగాయాలతో సంఘటనాస్థలంలోనే మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నాట్రాంపల్లి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను వాణియంబాడీ ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.