వన్నియార్లకు 10.5 రిజర్వేషన్లు రద్దు

ABN , First Publish Date - 2021-11-02T07:57:51+05:30 IST

: తమిళనాట వన్నియార్లకు ఓబీసీ రిజర్వేషన్లలో 10.5ు అంతర్గత రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చట్టాన్ని హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ సోమవారం రద్దు చేసింది...

వన్నియార్లకు 10.5 రిజర్వేషన్లు రద్దు

మదురై డివిజన్‌ బెంచ్‌ నిర్ణయం

చెన్నై, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): తమిళనాట వన్నియార్లకు ఓబీసీ రిజర్వేషన్లలో 10.5ు అంతర్గత రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చట్టాన్ని హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ సోమవారం  రద్దు చేసింది. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పరమక్కుడికి చెందిన బాలమురళి పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వం వన్నియార్లకు 10.5ు రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన ప్రకటనకు.. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం చట్ట రూపం కల్పించింది. దీనికి రాష్ట్ర గవర్నర్‌ కూడా ఆమోదం తెలిపారు. ఈ పరిస్థితుల్లో అత్యంత వెనుకబడిన తరగతులవారికి అమలుచేస్తున్న 20ు రిజర్వేషన్లలో వన్నియార్లకు 10.5 అంతర్గత రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఓబీసీల్లో 40 ఉపకులాలకు చెందినవారంతా విద్యా, ఉపాధి అవకాశాలు కోల్పోతారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్‌ దురైస్వామి, జస్టిస్‌ మురళీ శంకర్‌.. వన్నియార్లకు  రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టాన్ని రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని సీఎం స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో నిర్ణయించారు.

Updated Date - 2021-11-02T07:57:51+05:30 IST