చెన్నైలో మరో రెండు రోజులు Red Alert: రెవెన్యూ మంత్రి

ABN , First Publish Date - 2021-11-10T00:59:09+05:30 IST

చెన్నైలో మరో రెండు రోజులు Red Alert: రెవెన్యూ మంత్రి

చెన్నైలో మరో రెండు రోజులు Red Alert: రెవెన్యూ మంత్రి

చెన్నై: మరో రెండు రోజులపాటు చెన్నైలో రెడ్ అలర్ట్ ఉంటుందని తమిళనాడు రెవెన్యూ మంత్రి తెలిపారు. తమిళనాడు వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి 500లకు పైగా గుడిసెలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షాల వల్ల మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఇదిలా ఉంటే చెన్నైలో 24 గంటల వ్యవధిలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెన్నై వాసులు వరద సంబంధిత ఫిర్యాదుల కోసం 1913కి కాల్ చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావం వల్ల తమిళనాడు లో కొన్ని ప్రాంతాల్లో నవంబరు 9 నుంచి 11వ తేదీల మధ్య భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది.

Updated Date - 2021-11-10T00:59:09+05:30 IST