రాజధానిని వణికిస్తున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-03-22T13:10:56+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

రాజధానిని వణికిస్తున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పాజిటివ్ రేటు ఒక శాతాన్ని దాటి 1.03 శాతానికి చేరుకుంది. ఇది ఢిల్లీవాసులకు ఆందోళనకరంగా మారింది. తాజాగా పాజిటివ్ రేటు 1.07 శాతానికి చేరుకుని కొత్త రికార్డు నెలకొల్పింది. ఢిల్లీలో గత రెండు నెలల రికార్డులను దాటుతూ గడచిన 24 గంటల్లో కొత్తగా 823 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఒక వ్యక్తి కరోనాతో కన్నుమూశాడు. 


ప్రస్తుతం ఢిల్లీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,618కి చేరింది. ఢిల్లీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లోని వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో మొత్తం 79,714 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. మరోవైపు ఢిల్లీలో రోజురోజుకు కరోనా కారణంగా హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. గడచిన 24 గంటల్లో ఈ సంఖ్య 1,722 నుంచి 1,893కు చేరుకుంది. ఇప్పటివరకూ ఢిల్లీలో 6,47,984 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 6,33,410 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కాగా ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం బాధితుల కోసం మొత్తం 5,710 పడకలను ఏర్పాటు చేసింది. వీటిలో 892 బెడ్‌లు ఇప్పటికే బాధితులతో నిండిపోయాయి.

Updated Date - 2021-03-22T13:10:56+05:30 IST