Panjshir resistance force: తాలిబాన్లతో యుద్ధానికి సిద్ధం

ABN , First Publish Date - 2021-08-25T18:07:12+05:30 IST

తాలిబన్లతో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని పంజ్‌షీర్‌లోని పాపులర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్ అమీర్ అక్మల్ చెప్పారు....

Panjshir resistance force: తాలిబాన్లతో యుద్ధానికి సిద్ధం

పంజ్ షీర్ (అఫ్ఘానిస్థాన్): తాలిబన్లతో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని పంజ్‌షీర్‌లోని పాపులర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్ అమీర్ అక్మల్ చెప్పారు. ’’మా పాపులర్ రెసిస్టెన్స్ ఫ్రంట్‌లో చేరిన వారిలో ఎక్కువ మంది యువకులు, సైనికులు,మాజీ జిహాదీ కమాండర్లు ఉన్నారు, వారు నిర్బంధాన్ని అంగీకరించరు... అందరికీ సమగ్రమైన ఆమోదయోగ్యమైన వ్యవస్థను కోరుకుంటున్నారు. యుద్ధం చేయడానికి మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మేము తాలిబన్‌లకు వ్యతిరేకంగా శాంతి చర్చలకు లేదా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.’’ అని అమీర్ అక్మల్ చెప్పారు. హిందూకుష్ పర్వతాల్లోని పంజ్ షీర్ లోయ అజేయమైన కోటగా మారుతోంది.


ఎత్తైన పర్వతాలు, ఇరుకైన లోయ, పంజ్‌షీర్ నది అందించిన రక్షణ, పంజ్‌షీర్ లోయకు వెళ్లే అన్ని రహదారుల్లో తాజిక్ యోధుల ఆధిపత్యం కొనసాగుతోంది. రెసిస్టెన్స్ ఫ్రంట్ లో చేరడానికి అనేక మంది ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీ సైనికులు పంజ్‌షీర్ చేరుకున్నారు.‘‘మేం పాపులర్ రెసిస్టెన్స్ ఫ్రంట్‌లో చేరడం ద్వారా మా మాతృభూమిని, స్వేచ్ఛను కాపాడుకోవాలనుకుంటున్నాం’’ అని ఆ దళంలోని మరో పోరాట యోధుడు హమీద్ అన్నారు.


Updated Date - 2021-08-25T18:07:12+05:30 IST