రత్నగిరిలో ముస్తాబవుతున్న రథం
ABN , First Publish Date - 2021-09-03T14:13:39+05:30 IST
రత్నగిరిలో రూ.60 లక్షల వ్యయంతో తయారవుతున్న చెక్క రథాన్ని బాలమురుగన్ అడిమై స్వాములు గురువారం పరిశీలించారు. రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపం రత్నగి

వేలూరు(చెన్నై): రత్నగిరిలో రూ.60 లక్షల వ్యయంతో తయారవుతున్న చెక్క రథాన్ని బాలమురుగన్ అడిమై స్వాములు గురువారం పరిశీలించారు. రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపం రత్నగిరిలోని బాలమురుగన్ ఆలయానికి పారంపర్య ట్రస్టీగా బాల మురుగన్ అడిమై స్వాములు వ్యవహరిస్తున్నారు. ఆలయం కోసం రూ.60 లక్షల వ్యయంతో 36 అడుగుల ఎత్తుతో చెక్క రథం తయారుచేస్తున్నారు. ఈ పనులను పరిశీలించిన బాలమురుగన్ స్వాములు రథం నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని కోరారు.