మమతా బెనర్జీకి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు

ABN , First Publish Date - 2021-05-02T22:15:30+05:30 IST

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ల్యాండ్‌స్లైండ్ విక్టరీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి

మమతా బెనర్జీకి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ల్యాండ్‌స్లైండ్ విక్టరీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ, సువేందు అధికారి మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో విజయం ఇరువురి మధ్య దోబూచులాడింది. చివరి రౌండ్‌లో విజయం మమత సొంతమైంది. అయితే, మరో రౌండ్ మిగిలి ఉండగానే మమతకు రాజ్‌నాథ్‌సింగ్ అభినందనలు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ సాధించిన విజయానికి శుభాకాంక్షలు అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్న ఆమెకు నా శుభాకాంక్షలు అని ఆ ట్వీట్‌లో మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-02T22:15:30+05:30 IST