నెల రోజుల పెరోల్‌పై నళిని విడుదల

ABN , First Publish Date - 2021-12-28T17:32:30+05:30 IST

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసులో 30 ఏళ్లుగా వేలూరు మహిళా జైలులో యావజ్జీవశిక్ష అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో, నళినికి అనారోగ్యంగా ఉందని, చికిత్స

నెల రోజుల పెరోల్‌పై నళిని విడుదల

చెన్నై/వేలూరు: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసులో  30 ఏళ్లుగా వేలూరు మహిళా జైలులో యావజ్జీవశిక్ష అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో, నళినికి అనారోగ్యంగా ఉందని, చికిత్స కోసం ఆమెకు పెరోల్‌  మంజూరు చేసేలా రాష్ట్రప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేయాలని ఆమె తల్లి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ విచారణకు రాగా, నళినికి నెల రోజులు పెరోల్‌ ఇస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలియ జేసింది. దీంతో, నళిని సోమవారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ కాట్పాడి సమీపంలోని బ్రహ్మపురం ప్రాంతంలోని తన స్వగృహానికి వెళ్లింది.

Updated Date - 2021-12-28T17:32:30+05:30 IST