‘రజినీకాంత్ అభిమానుల ఓట్లు మాకే..’
ABN , First Publish Date - 2021-01-12T15:46:55+05:30 IST
‘రజినీకాంత్ అభిమానుల ఓట్లు మాకే..’

చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు బీజేపీకే ఓటు వేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కన్నియకుమారి జిల్లా పార్టీ నాయకుల సమావేశం సోమవారం నాగర్‌కోయిల్‌లో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి పొన్.రాధాకృష్ణన్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా మురుగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మురుగన్ మాట్లాడుతూ.... రాష్ట్ర్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహిళా మోర్చా ఆధ్వ ర్యంలో ‘నమ్మ ఊరు పొంగల్’ వేడుకలు కోలాహలంగా జరిగాయన్నారు.
మదురై జిల్లా బీజేపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్టు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో బూత్ కమిటీల ఏర్పాటు, కన్నియకుమారి పార్లమెంటు నియోజకవర్గ ఉపఎన్నిక, రానున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చించామని తెలిపారు. కన్నియకుమారి ఉప ఎన్నికకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఈ ఉపఎన్నిక విజయానికి తొలి మెట్టు కాబోతోందన్నారు. కేంద్రప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రూ.6 వేల ప్రోత్సాహక భత్యం రాష్ట్రంలో 41 లక్షల మంది పొందుతున్నారన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులు మేలు చేస్తాయని, రాజకీయ లబ్ధి కోసమే ఆ చట్టాలకు వ్యతిరేకంగా డీఎంకే ఆందోళన చేస్తోందన్నారు.
