అవినీతి ఐపీఎస్ అధికారిపై రాజస్థాన్ సర్కారు సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2021-02-06T12:58:24+05:30 IST

అవినీతి ఐపీఎస్ అధికారిపై రాజస్థాన్ సర్కారు సస్పెన్షన్ వేటు విధించింది....

అవినీతి ఐపీఎస్ అధికారిపై రాజస్థాన్ సర్కారు సస్పెన్షన్ వేటు

జైపూర్ (రాజస్థాన్): అవినీతి ఐపీఎస్ అధికారిపై రాజస్థాన్ సర్కారు సస్పెన్షన్ వేటు విధించింది. ఐపీఎస్ అధికారి మనీష్ అగర్వాల్ ను రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసి 48 గంటలు గడచిన నేపథ్యంలో అతన్ని సస్పెండ్ చేసినట్లు రాజస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ అధికారి మనీష్ అగర్వాల్ దౌసా జిల్లా ఎస్పీగా పనిచేసినపుడు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని రాజస్థాన్ ఏసీబీ కేసు నమోదు చేసింది. జాతీయ రహదారి నిర్మాణ సంస్థ నుంచి రూ.38 లక్షల రూపాయల లంచాన్ని ఎస్పీ తీసుకున్నారని పెట్రోల్ పంపు యజమాని నీరజ్ మీనా అరెస్టుతో బయటపడింది. అగర్వాల్ మధ్యవర్తి నుంచి నెలకు రూ.4లక్షల చొప్పున డబ్బులు వసూలు చేశారని వెల్లడైంది. స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ అధికారిగా పనిచేస్తున్నఅగర్వాల్ ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. 

Updated Date - 2021-02-06T12:58:24+05:30 IST