రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గజేంద్రసింగ్ కన్నుమూత

ABN , First Publish Date - 2021-01-20T21:03:35+05:30 IST

రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గజేంద్రసింగ్ షెకావత్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు....

రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గజేంద్రసింగ్ కన్నుమూత

జైపూర్ (రాజస్థాన్): రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గజేంద్రసింగ్ షెకావత్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. కాలేయ సమస్యతో బాధపడుతున్న గజేంద్రసింగ్ కు ఇటీవల కరోనా వైరస్ కూడా సోకింది. ఉదయ్ పూర్ జిల్లా వల్లభ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గజేంద్రసింగ్ వయసు 48 ఏళ్లు. గజేంద్రసింగ్ మృతికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ లు సంతాపం తెలిపారు. గజేంద్రసింగ్ షెకావత్ రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. సచిన్ పైలెట్ వర్గానికి చెందిన గజేంద్ర సింగ్ సీఎం అశోక్ గెహ్లాట్ కు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేశారు. ఈయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లున్నారు.మరణించిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో షెకావత్ మూడోవ్యక్తి.

Updated Date - 2021-01-20T21:03:35+05:30 IST