పెళ్లి వేడుకలో ఎంపీ, ఎమ్మెల్యే డాన్స్...వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-06-22T17:33:18+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయి మాధోపూర్ లో జరిగిన వివాహ వేడుకలో కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించి సాక్షాత్తూ ఎంపీ, ఎమ్మెల్యేలు డాన్స్ చేసిన...

పెళ్లి వేడుకలో ఎంపీ, ఎమ్మెల్యే డాన్స్...వీడియో వైరల్

జైపూర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయి మాధోపూర్ లో జరిగిన వివాహ వేడుకలో కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించి సాక్షాత్తూ ఎంపీ, ఎమ్మెల్యేలు డాన్స్ చేసిన వీడియో, చిత్రాలు వైరల్ గా మారింది. సవాయి మాధోపూర్ పరిధిలోని బడిలా గ్రామంలో జరిగిన వివాహ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ కిరోడిలాల్ , రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇందిరామీనాలు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలో ఎంపీ కిరోడిలాల్, ఎమ్మెల్యే ఇందిరా మీనాలు జానపద గాయకుల బృందంతో కలిసి నృత్యం చేశారు. 


కరోనా వైరస్ మహమ్మారి ప్రబలుతున్న సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి కొవిడ్ మార్గదర్శకాలు ఉల్లంఘించి సామాజిక దూరం పాటించకుండా డాన్స్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీని క్లిప్ లు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. బీజేపీ ఎంపీ ముఖానికి మాస్కు ధరించినా సామాజిక దూరం పాటించకుండా నృత్యం చేయడం కొవిడ్ నిబంధనల ఉల్లంఘనగా నెటిజన్లు పేర్కొన్నారు.కొవిడ్ ఆంక్షలు సడలించినా ఇంకా కొన్ని పరిమితులు విధించారు. 

Updated Date - 2021-06-22T17:33:18+05:30 IST