వర్షానికి నేలకొరిగిన వరి పంట

ABN , First Publish Date - 2021-10-07T16:17:46+05:30 IST

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి తుంగభద్ర నదీతీరాన వేసుకున్న ఖరీఫ్‌ పంటలు నేలకొరిగాయి. కంప్లి సమీపంలోని సణ్ణాపురం, బెళుగోడు, ఇటిగి తదితర ప్రాంతాల్లో చేతికొచ్చిన పంట

వర్షానికి నేలకొరిగిన వరి పంట

కంప్లి(కర్ణాటక): గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి తుంగభద్ర నదీతీరాన వేసుకున్న ఖరీఫ్‌ పంటలు నేలకొరిగాయి. కంప్లి సమీపంలోని సణ్ణాపురం, బెళుగోడు, ఇటిగి తదితర ప్రాంతాల్లో చేతికొచ్చిన పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ యేడాది ఉల్లికోడు వైరస్‌తో పాటు వర్షాల ప్రభావంతో చేతికొచ్చిన సోనా వరి పంట పూర్తిగా నేలకొరిగింది. పెట్టుబడులు కూడా వస్తాయో లేదోనని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి ఈ వర్షాలు, వాతావరణ ప్రభావంతో తుంగభద్ర నదీతీరాన వుండే గ్రామాలలో వేసుకున్న ఖరీఫ్‌ పంటలు రేపోమాపో పంటలు కోసే సమయంలో వర్షాలు పడి పూర్తిగా దెబ్బతిన్నాయి. పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘ నాయకులు కొట్టూరు రమేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను కూడా తక్కువ ధరలకు అందుబాటులో వుంచాలన్నారు. ప్రతినిత్యం వర్షం ప్రభావంతో నేలకొరిగిన పంటను కూలీలతో కుప్పలుగా కట్టిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-10-07T16:17:46+05:30 IST