రాజ‌ధానిలో భారీవ‌ర్షం... నీట మునిగిన ఇళ్లు, జ‌ల‌మ‌య‌మైన రోడ్లు!

ABN , First Publish Date - 2021-05-20T16:35:53+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీని అకాల వర్షాలు అత‌లాకుత‌లం...

రాజ‌ధానిలో భారీవ‌ర్షం... నీట మునిగిన ఇళ్లు, జ‌ల‌మ‌య‌మైన రోడ్లు!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని అకాల వర్షాలు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు, భైరో ఆలయంతో పాటు ప‌లు ప్రాంతాల్లో వ‌ర్ష‌పు నీరు నిలిచిపోయింది. నజాఫ్‌గ‌ఢ్‌ ప్రాంతంలోని ఖైరా మ‌లుపు వద్ద రహదారి పూర్తిగా కుంగిపోయింది. భారీ వ‌ర్షాల‌కు ఒక ఇల్లు కూలిపోయిది. మెట్రో నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఒక ట్ర‌క్కు గొయ్యిలో కూరుకుపోయింది. 


అకాల వర్షాలు కురుస్తున్న నేప‌ధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు కోరారు. తౌక్తే తుపాను కారణంగా వర్షం కురుస్తున్న‌ద‌ని అధికారులు తెలిపారు. కాగా రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 23.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, ఇది గత 70 సంవత్సరాలలో మేలో న‌మోదైన అత్యంత త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు. అంతకుముందు 1951 సంవత్సరంలో గరిష్ట ఉష్ణోగ్రత దీని కంటే తక్కువగా న‌మోద‌య్యింది. ఢిల్లీలో 31.3 మిల్లీమీట‌ర్ల‌ వర్షపాతం నమోదైంది. రాగ‌ల‌ 24 గంటల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

Updated Date - 2021-05-20T16:35:53+05:30 IST